గూగుల్ నుంచి వచ్చే కొత్త పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ గురించి టెక్ ప్రపంచంలో ఆసక్తికరమైన గాసిప్‌లు వినిపిస్తున్నాయి.గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన Pixel 9 సిరీస్ మాదిరిగానే,కొత్త Google Pixel 10 సిరీస్ కూడా అదే సమయానికి అంటే 2025 సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పిక్సెల్ 10 సిరీస్‌లో Google మరోసారి రెండు మోడల్స్‌ను ప్రవేశపెట్టనుంది Pixel 10 & Pixel 10 Pro. ఇప్పటికే ఈ డివైజ్‌లు అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం.ఇందులో ఉండే కొత్త Tensor G5 చిప్‌సెట్,మెరుగైన కెమెరా ఫీచర్లు,మరియు ఫ్లాట్ డిస్‌ప్లే డిజైన్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
ఈ సిరీస్‌లో Android 15 ఓఎస్,అధునాతన AI ఫీచర్లు కూడా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.2025 సెప్టెంబర్‌లో Google యొక్కవార్షిక ఉత్సవం “Made by Google” ఈవెంట్ జరగనుండటంతో,అదే వేళ పిక్సెల్ 10 లాంచ్ కావచ్చు.
ఇప్పటికే పిక్సెల్ ఫోన్‌లపై ఆసక్తి పెరుగుతుండడంతో,ఈ కొత్త సిరీస్‌కు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా.