Google Pixel 9a: బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు

గూగుల్ తాజాగా విడుదల చేసిన Pixel 9a ఫోన్ 2025లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి హంగామా సృష్టిస్తోంది.ఈ ఫోన్ బడ్జెట్ సెక్టార్‌లో ఉన్నప్పటికీ ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు అందిస్తోంది.

ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది,ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా సాఫ్ట్ మరియు క్లియర్ విజువల్స్ ఇస్తుంది.Google Tensor G4 చిప్‌సెట్ ఫోన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభ్యం.

ఫోటోగ్రఫీకి 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 5100mAh బ్యాటరీ 23W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Pixel 9a Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది,Google నుండి 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందుతుంది,ఇది దీర్ఘకాలిక మద్దతును సూచిస్తుంది.

ఈ ఫోన్ ధర సుమారు ₹49,999గా ఉంది. బ్లాక్, వైట్, బ్లూ, పింక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Leave a Comment