Infinix GT 30 Pro: గేమింగ్ ఫోన్ మార్కెట్‌లో కొత్త సవాలు

nfinix తాజాగా విడుదల చేస్తున్న GT 30 Pro 2025లో గేమింగ్ ఫోన్ వినియోగదారుల కోసం ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.ఈ ఫోన్ గేమింగ్ సామర్థ్యాల దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన స్క్రీన్ అనుభవాన్ని ఇస్తుంది. ప్రాసెసర్‌గా MediaTek Dimensity 8350 Ultimate వాడడం వల్ల గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ లో మంచి పనితీరును కలిగిస్తుంది. 8GB RAM,256GB స్టోరేజ్‌తో యూజర్ ఎక్కువ ఆప్స్ ఓపెన్ చేసుకున్నా నో ప్రాబ్లెమ్.

కెమెరా విభాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సపోర్ట్ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5500mAh బ్యాటరీతో దీర్ఘకాల ఉపయోగం సాధ్యం.45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది,ఇది ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేస్తుంది.

Infinix GT 30 Pro ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించిన Shoulder Triggers తో వస్తోంది,ఇవి గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. Cyber Mecha 2.0 డిజైన్ ఫోన్ కు స్పోర్టీ లుక్ ఇస్తుంది.

ఈ ఫోన్ ధర సుమారు ₹26,999 గా ఉండనుంది. Flipkart వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Leave a Comment