ప్రముఖ గేమ్ డెవలపర్ 4A గేమ్స్ రూపొందించిన Metro 2033 Redux అనేది 2010లో వచ్చిన “మెట్రో 2033” గేమ్‌కు అప్‌గ్రేడ్ అయిన వెర్షన్.ఇది మాస్కో నగరం అణు యుద్ధం తర్వాత ఏ విధంగా ధ్వంసమైందో చూపించే ఒక డార్క్ మరియు థ్రిల్లింగ్ ప్రపంచంలో సాగుతుంది.
ఈ గేమ్ కథానాయకుడు అర్టియోమ్ చుట్టూ తిరుగుతుంది.అతను మెట్రో టన్నెల్స్‌లో జీవించాల్సి వచ్చిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయాణం ప్రారంభిస్తాడు.ఈ ప్రయాణంలో అతను మ్యూటెంట్లు,శత్రువులు,మరియు ఇతర మానవుల నుండి తనను రక్షించుకోవాల్సి వస్తుంది.
Redux వెర్షన్ల, కొత్త గేమ్ ఇంజిన్‌తో మెరుగైన గ్రాఫిక్స్ స్మూత్ గేమ్‌ప్లే అధునాతన లైటింగ్ మరియు షాడో ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆటగాళ్లు రెండు మోడ్‌లలో గేమ్‌ను ఆడవచ్చు.Survival Mode (తక్కువ Ammo, హార్డ్ కోర్ గేమింగ్) మరియు Spartan Mode (జరిగిపోయే యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం).
రేంజర్ మోడ్ ద్వారా HUD లేకుండా పూర్తి ఇమర్షివ్ అనుభూతిని పొందవచ్చు.ఇది నెక్స్ట్ లెవెల్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ గేమ్ ప్రస్తుతం PC, PS4, Xbox One, Nintendo Switch వేదికలపై అందుబాటులో ఉంది.