2025లో రానున్న Apple iPhone 17 Pro Max మరియు iPhone 17 Pro మోడళ్లపై ఇప్పటికే టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ సారి Apple కొన్ని గమనించదగ్గ మార్పులు చేస్తోంది.ఇందులో ఆ ఐదు ప్రధాన ఫీచర్లను గురించి తెలుసుకుందాం.
1. 48MP ట్రిపుల్ కెమెరా సెటప్:
iPhone 17 Pro సిరీస్‌లో మూడు కెమెరాలు అన్ని 48 మెగాపిక్సెల్ లెన్స్‌లతో ఉండబోతున్నాయి – ప్రైమరీ, అల్ట్రా వైడ్ మరియు టెలిఫోటో.ఇది ఫోటోగ్రఫీ లో ఓ గేమ్ చేంజర్ అవుతుంది.
2. 24MP ఫ్రంట్ కెమెరా:
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.ఇది గత మోడళ్ల కంటే భారీ అప్‌గ్రేడ్.
3. శక్తివంతమైన A19 Pro చిప్:
iPhone 17 Pro మోడళ్లలో కొత్త A19 Pro ప్రాసెసర్ ఉంటుంది.ఇది వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
4. అల్యూమినియం బాడీ డిజైన్:
పాత టైటానియం ఫ్రేమ్ స్థానంలో, తాజా మోడళ్లలో తేలికైన అల్యూమినియం ఫ్రేమ్ వాడే అవకాశం ఉంది.
5. Wi-Fi 7 సపోర్ట్:
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం Wi-Fi 7 టెక్నాలజీకి సపోర్ట్ ఉంటుందన్నది ప్రధాన అప్‌గ్రేడ్.
ఈ మార్పులతో iPhone 17 Pro సిరీస్ టెక్ మార్కెట్‌లో మరింత పటిష్టంగా నిలవనుంది.