స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మళ్ళీ ఒక అద్భుతాన్ని తీసుకొస్తోంది రియల్‌మీ.కొత్తగా లాంచ్ కానున్న Realme GT 7 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కంపెనీ మే 27, 2025న గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లతో పాటు, గేమింగ్ మరియు హెవీ యూజ్ కోసం రూపొందించిన శక్తివంతమైన హార్డ్వేర్ ఉంటుంది.
Realme GT 7 లో 7,000mAh భారీ బ్యాటరీ,120W సూపర్ ఫాస్ట్ చార్జింగ్, మరియు MediaTek Dimensity 9400e ప్రాసెసర్ లభించనున్నాయి.ఇది 6.78 అంగుళాల AMOLED 144Hz డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్,మరియు 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తోంది.ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
అంతేకాకుండా ఇది Android 15 పై రన్ అవుతుందని భావిస్తున్నారు.ఈ ఫోన్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కావడం,VC కూలింగ్ సిస్టమ్ ఉండటం వంటివి గేమింగ్ లవర్స్‌కి అదనపు ఆకర్షణ.
ఇది రియల్‌మీ వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది.ప్రీమియం ఫీచర్లు మరియు పోకడలను బట్టి చూస్తే ఇది 2025లో ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌ను షేక్ చేయగలదు.