భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విభాగంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రధాన పాత్ర పోషిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంతో సురక్షితంగా, సులభంగా డబ్బులను పంపించడానికి మరియు స్వీకరించడానికి వీలవుతుంది.
UPI వాడకదారులకు బ్యాంక్ ఖాతా నంబర్లు అవసరం లేకుండానే మొబైల్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ద్వారా లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది.Google Pay, PhonePe,Paytm, BHIM వంటి అనేక యాప్‌లు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఒకే యాప్ ద్వారా ఒక్కసారి బ్యాంక్ లింక్ చేసుకుంటే, పలు రకాల చెల్లింపులు – షాపింగ్, బిల్లు పేమెంట్స్, పర్సనల్ ట్రాన్స్ఫర్‌లు – అన్నీ చేయవచ్చు.
తాజా గణాంకాల ప్రకారం, 2025లో ప్రతి నెల UPI ద్వారా సుమారుగా 1400 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారాల నుంచీ పెద్ద కంపెనీల వరకు ప్రతి స్థాయిలో డిజిటల్ చెల్లింపులకు దోహదపడుతోంది.
ఇటీవల RBI ఆధ్వర్యంలో UPI లైట్, UPI ఇంటర్నేషనల్ మరియు క్రెడిట్ లైన్ ద్వారా UPI వంటి సేవలు ప్రవేశపెట్టడం ద్వారా ఇది మరింత విస్తృతమవుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో కూడా UPI వాడకం పెరుగుతుండటంతో దేశం మొత్తం డిజిటల్ ఇండియా దిశగా వేగంగా ముందుకు సాగుతోంది