సామ్‌సంగ్ తన ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన Galaxy S25 Edgeను అధికారికంగా ప్రకటించింది.ఇది 2025లో టెక్ ప్రపంచాన్ని ఆకర్షించిన మొబైల్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్తగా పరిచయం చేసిన Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పంజా విసురుతోంది.వేగవంతమైన పనితీరు,అధునాతన గేమింగ్ సామర్థ్యం దీని ముఖ్య ఆకర్షణలుగా ఉన్నాయి.
ఫోటోగ్రఫీ ప్రేమికులకు గుడ్‌న్యూస్ Galaxy S25 Edge 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది.దీని సహాయంతో యూజర్లు ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు తీర్చిదిద్దవచ్చు.అదనంగా 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో లెన్సులు ఉన్నాయి.ముందు భాగంలో ఉన్న 40MP సెల్ఫీ కెమెరా కూడా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది.
6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే,144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చి అత్యద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.5000mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు Android 15 OS దీని ఇతర కీలక ఫీచర్లు.
ఫోన్ డిజైన్ పరంగా మినిమలిస్టిక్ గ్లాస్-మెటల్ ఫినిష్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
ఈ ఫోన్ ప్రస్తుతం కొద్ది దేశాల్లో లభ్యమవుతోంది. భారత్‌లో విడుదలకు సంబంధించి కంపెనీ అధికారిక సమాచారం త్వరలో అందించనుంది.