అపిల్ సంస్థ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone 17 సిరీస్‌ను 2025 సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కొత్త iPhone లను విడుదల చేయడం అపిల్‌కు సాధారణమైన సంప్రదాయం. అందువల్ల ఈసారి కూడా సెప్టెంబర్ రెండో వారంలో సెప్టెంబర్ 10 లేదా 11 తేదీల్లో కొత్త iPhone మోడళ్లను పరిచయం చేసే అవకాశం ఉంది.
ఈ సారి iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, మరియు వినూత్నంగా iPhone 17 Air అనే కొత్త మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. iPhone 17 Air అనేది ఇప్పటి వరకు అపిల్ విడుదల చేసిన ఫోన్‌లలో అత్యంత సన్నగా ఉండబోతున్నదని లీకులు సూచిస్తున్నాయి.
అలాగే, కొత్త మోడళ్లలో A19 బయోనిక్ చిప్, మెరుగైన కెమెరా ఫీచర్లు, మరియు iOS 19తో పాటు వచ్చే యూనిక్ డిజైన్ అపిల్ అభిమానులను ఆకట్టుకోనుంది. ముఖ్యంగా Pro మోడళ్లలో 8K వీడియో రికార్డింగ్, మరియు డ్యూయల్ ఫ్రేమ్ వీడియో మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫోన్లు విడుదలవ్వగానే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఉండనున్నాయి.భారత మార్కెట్లోనూ ఈ ఫోన్లపై భారీ డిమాండ్ ఉండే అవకాశముంది.