క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు ఏర్పడుతుంది !

What Is Cloud Burst In Telugu :- ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వర్షాల కారణంగా చాల మంది ప్రాణాలు కొల్పోయారు. వానలు ఎక్కువగా పడడం వలన భూమి మీద నీటి శాతం ఎక్కువగా అయి, ఈ నీరు నివాసం ఉన్న ఇండ్లలోకి ప్రేవేశించి ప్రజలందరి ఇబ్బంది పెడుతున్నది. ఈ నీరు రావడం వలన వారికి తినేకి తిండి లేక తాగేకినీరు లేక వాళ్ళు ప్రతి పూట పస్తులు ఉంటున్నారు.

రాత్రి అనక పగలు అనక బాధితులు అందరు నిద్ర లేకుండా జీవనం గడుపుతున్నారు. ఈ వర్షం కారణంగా తెలంగాణలో ఉండే గోదావరి నది ఎన్నడు లేని విధంగా ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలోకి నీరు చేరి అన్ని వీధులని జలమాయంగా ,మార్చింది. అలాగే రాముని గుడిలోకి కూడా నీరు చేరింది. ఈ వర్షం ఎందుకు ఇంత భయందోలనగా మారింది? ఏ కారణం వలన వర్ష శాతం ఎక్కువ అయినది ? అనేది తెలుసుకొందం.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ?

క్లౌడ్ బరస్ట్ అనగా దాదాపు 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంటలో100 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం వస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవ్వడం వలన ఒకొక్కసారి వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

మన దేశంలో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాలు ఉన్నాయి. అవి హిమాలయా పర్వతాలు, హిమాలయల వద్ద ఉండే చిన్న గ్రామాలు. ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల జూలై 8న కురిసిన వర్షం వల్ల, జమ్మూ కశ్మీర్‌లో అలాగే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో 16 మంది చనిపోగా 20 మందికిపైగా గాయపడ్డారు.

క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుంది ?

క్లౌడ్ బరస్ట్ లు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయి అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు.  ఎందుకు అనగా ఈ క్లౌడ్ బరస్ట్ లు అనేవి మన చేత నిర్మించబడినవి కావు, ఇవి సహజమైనది. అందుకు ఎవరు కూడా క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు వస్తాయి అనేది చెప్పరు. అలాగే ఈ క్లౌడ్ బరస్ట్ అనేది పర్యావరణంలో ఉండే విపత్తుల వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. 

ఈ క్లౌడ్ బరస్ట్ లు ఎలాంటి ప్రాంతంలో ఏర్పడుతాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఇవి ఏతైన కొండ ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా చోటు చేసుకొంటాయి అనేది మాత్రం చెప్పగలరు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, వంటి ఎతైన ప్రాంతాలలో వాతావరణం మార్పుల వలన ఇవి అనుకోకుండా ఆ ప్రాంతాలలో సంభవించవచ్చు.

క్లౌడ్ బరస్ట్ ఎలా జరుగుతుంది ?

రుతుపవనాలు దేశంలోకి వచ్చినపుడు ఆరేబియ సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాలలో ప్రయాణిస్తున్నపుడు అధిక తేమని కలిగి ఉంటాయి. అయితే వర్షం పడే పరిస్థితి ఏర్పడినప్పటికీ, వేడి వాతావరణం వలన మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది.

ఇలా ఘనిభవ ప్రక్రియ ఎక్కువ సార్లు కొనసాగడంతో మేఘాలు సాంద్రత పెరిగి ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్పోటము చెందుతాయి. దీంతో తక్కువ పరిధిలో, తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారి వరదలకు కారణమం అవుతాయి.

 ఇండియాలో క్లౌడ్ బరస్ట్ గతంలో ఎప్పుడు చోటు చేసుకుంది ?

భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్ట్ లు భారత్ లో కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాలలో ప్రతి ఏట పదుల సంఖ్యలలో క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తునట్లు పలు నివేదిలలో ఉన్నది. భారత వాతావరణ శాఖ ప్రకారం 1970 నుండి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్ లు సంభవించాయి. 

2002 లో ఉత్తరాంచల్లో సంభవించిన  కుంభవృష్టికి 20 మంది బాలి అయ్యారు. అనుకోకుండా వరదల దాటికి పలు గ్రామాలకి తీవ్ర నష్టం వచ్చింది. కొత్త గా అమర్ నాథ్  గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద కారణంగా కొంత మంది మరణించారు, మరికొందరు గాయాలపాలయ్యారు.

దిన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏంటంటే, క్లౌడ్ బరస్ట్ అనేది ఎప్పుడైనా సంభవిస్తే, అది మనం అంచనా కూడా వేయలేని ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతుంది. ఒక్కసారిగా వచ్చే ఆకస్మిక వరదల వల్ల చాల పెద్ద మొత్తంలోనే నష్టాన్ని చవి చూడాల్సివస్తుంది అనేది ఎవ్వరు కాదనలేని నిజం. అందుకే మనం ఎప్పటికి ఇలాంటి క్లౌడ్ బరస్ట్ లు జరగకూడదు అని దేవుణ్ణి తలుచుకుందాం.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment