చిరు ధాన్యాలు అంటే ఏమిటి ? వాటి వలన కలిగే ఉపయోగాలు !

చిరుధాన్యాలు అంటే ఏమిటి | What Is Millets Seeds In Telugu 

Millets Seeds In Telugu : చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు ఆహార ధాన్యాలలో చిన్న గింజల  కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం, వీటిని పండిస్తారు. మిల్లెట్‌లు చాలా వైవిధ్యభరితమైన చిన్న-విత్తనాల గడ్డి సమూహం, వీటిని ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల పంటలుగా లేదా మేత మరియు మానవ ఆహారం కోసం ధాన్యాలుగా విస్తృతంగా పెంచుతారు. సాధారణంగా మిల్లెట్‌లు అని పిలువబడే చాలా జాతులు Paniceae తెగకు చెందినవి, అయితే కొన్ని మిల్లెట్‌లు అనేక ఇతర టాక్సాలకు చెందినవి.

రాగులు(Finger Millet), సజ్జలు, కొర్రలు గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు మాత్రం చాలా ఎక్కువ. నేడు ధాన్యాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నవి జొన్నలు, రాగులు, కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కూడా వాడుతున్నారు. కానీ, కొర్రలు, అరికలు, వరిగెలు, సొములు ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు.

కొందరైతే వీటిని చూసి కూడా ఉండరు. చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరు ధాన్యాల్లో పొట్టు తీసినా, కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి కొవ్వు, చికు -ధాన్యాలు షుగర్ పేషంట్లకు ఒక బలం లాంటివి. ధాన్యాల్లో ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

కాబట్టి వీటిలోని గ్లూకోజ్ కూడా వర్తంలో కలుస్తుంది. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను నములుతూ తినడానికి కాస్త ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తీసుకునే ఆహార పరిమాణం సైతం తగ్గుతుంది. ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు. ఇలా బరువు తగ్గటానికి తోడ్పడతాయి. రక్తంలో కొలెస్టాల్ శాతం అదుపులో ఉంటుంది.

చిరుధాన్యాలు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడతాయి. దీంతో కడుపులో ఇబ్బంది అల్సర్ల వంటివి తలెత్తకుండా ఉంటుంది. వీటితో కాల్షియం, జనుము లభించడంతో పాటు మలబద్దకం కూడా దూరం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చిరుధాన్యాలు రకాలు ఏమిటి | Types Of Millet Seeds In Telugu 

  • జొన్నలు
  • సజ్జలు
  • కోరలు
  • వరిగెలు
  • రాగులు
  • గోధుమలు
  • ఓట్స్
  • కులై
  • అరికెలు
  • అండు కొర్రలు
  • సమాలు
  • ఊద‌లు
  • కార్న్
  • ఉలవలు మొదలైనవి…

చిరుధాన్యాల వలన కలిగే ఉపయోగాలు | Benefits in Millet Seeds In Telegu

స‌జ్జ‌లు 

అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌జ్జ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. వీటి వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఊద‌లు

మ‌ల‌బ‌ద్ద‌కం, జీర్ణ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఊద‌ల‌ను తింటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

జొన్న‌లు

జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది, క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

సామ‌లు

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు సామ‌ల‌ను వండుకుని తినాలి. ఇవి శ‌రీరానికి పోషకాల‌ను అందిస్తాయి. ఎముక‌లు, న‌రాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్స‌ర్ రాదు. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తాయి.

ఉల‌వ‌లు

కిడ్నీ లో స్టోన్లు ఉన్న‌వారు ఉలవ‌ల‌ను తినాలి.  వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది, మూత్ర సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

అరికెలు

డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అరికెల‌ను తినాలి. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది.

రాగులు

ఈ గింజలతో జావ‌, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తిన‌వ‌చ్చు, శ‌రీరానికి రాగులు చ‌ల‌వ చేస్తాయి, ఎండ‌కాలంలో వీటిని తీసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం క‌లుగుతుంది, అలాగే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

కొర్ర‌లు

అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డేవారు కొర్ర‌ల‌ను వండుకుని తినాలి, దీని వ‌ల్ల బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గుండె జ‌బ్బులు రావు కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

ఓట్స్

వీటిలో పోషక విలువలు తెలుసుకోవటం మరియు మార్కెట్ లో ఈ ఉత్పత్తులు విస్తృత పరిధిలో ఉన్నాయి. ఇవి అనేక రకాల రుచులతో నిల్వ పదార్దాలుగా వస్తున్నాయి ఇవి అంత ఆరోగ్యానికి మంచిది కాదు.

గోధుమలు 

ఇది అత్యంత ఆరోగ్యకరమైన అల్పాహార ధాన్యాలలో ఒకటిగా చెప్పుకోగలం, ఫ్రోస్టెడ్ గోధుమలో ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉన్నాయి. దీనిలో మంచి పోషక విలువలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Leave a Comment