ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ జరీన్ !

నిఖత్ జరీన్ ఒక భారతీయ బాక్సర్. ఆమె 2022 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె అంటాల్యలో జరిగిన 2011 AIBA మహిళల యూత్ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. గౌహతిలో జరిగిన రెండో ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ తొలి సారిగా ఈ నెల తెలంగాణా రాష్ట్రానికి రానున్నారు. సి యం కెసిఆర్ ఆదేశము మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలక నున్నారు. జరీన్ ఫ్లై వెయిట్ విభాగంలో 50-52 కేజీలు థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌పై విజయం సాధించింది.

అలాగే ఈమెతో పాటు జర్మనీ లో జరిగిన ప్రపంచ ఘూటింగ్ లో గోల్డ్ మెడల్ సాదించిన ఇషా సింగ్ కూడా రానున్నారు. కావున వీలిందరిని గ్రాండ్ వెల్ కం చేయాలి అని cm కెసిఆర్ ఆదేశించాడు, వీటికి తగిన ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న నిఖత్ జరీన్.  ప్రపంచ ఛాంపియన్‌గా కిరీటం పొందిన ఐదవ భారతీయ మహిళగా నిలిచింది. ఛాంపియన్‌షిప్‌లోని ఫ్లైవెయిట్ విభాగంలో బాక్సర్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామస్‌పై విజయం సాధించినది.

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత సత్తా ఏంటో మరోసారి సాటిచెప్పింది. జూనియర్ బాక్సింగ్ లోనూ ఛాంపియన్ గా నిలిచిన జరీన్ రానున్న రోజుల్లో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా కఠోర సాధన చేస్తుంది.

వరల్డ్ బాక్సింగ్ పోటీలలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ విజయం వెనుక ఆమె 14 ఏళ్ల శ్రమ ఉందని భాస్కర్ భట్ అన్నారు. మానసికంగా, సాంకేతికంగా ఆటలో జారిన చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ప్రతిరోజు గంటలకొద్దీ సాధన ఆమె చేసిందని భట్ చెప్పారు.

Leave a Comment