కృతి శెట్టి ఈ పేరుకు పెద్ద గా పరిచయ అవసరం లేదు, ఈమె మొదటి తెలుగు సినిమా ఉప్పెన నుండి అందరికి బాగా ఫేమస్ అయ్యిన హీరొయిన్, వరుసన సినిమాలు హిట్ కొట్టుకొంటూ వచ్చిన బెబమ్మ, ఇతర భాషలలో కూడా మంచి పేరు తెచ్చుకున్న అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న, ఈ భామ ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.
అతి చిన్న వయసులోనే స్టార్ ఎంజాయ్ చేస్తోంది. సినిమా సినిమాకు అందనంత ఎత్తుకు ఎదుగుతోందీ బ్యూటీ. చేతి నిండా సినిమాలతో కృతి శెట్టి ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘ది వారియర్ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. అలాగే సూర్య-బాలా కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైంది.
అయితే ఇటీవల ఓ తమిళ్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ సందర్భంగా ఫంక్షన్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్స్ కృతి శెట్టిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఆమెను కంటితడి పెట్టించే పని చేశారు. దీంతో కృతి లైవ్ లోనే కన్నీరు పెట్టుకుంది. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది.
అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఇదంతా ప్రాక్ అని తెలియక భయపడిన కృతి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. ప్రాంక్ తో కృతి శెట్టిని ఏడిపించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యాంకర్లకు చివాట్లు పెడుతున్నారు. స్టార్ డమ్ ఉన్న వారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కృతి కంట తడిపెట్టించిన ఈ ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.