నాగచైతన్య, రానా వీళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే, సినిమాలో కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉంటారు. కానీ రానా, నాగచైతన్య కి అసలు ఎం కామెంట్ పెట్టాడు అందులో ఏం ఉంది. అంది ఏంటో తెలుసుకొందం !
అక్కినేని హీరోలతో రానా చాలా క్లోజ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారన్నది కూడా కామన్. అదే విధంగా తాజాగా విడుదలయిన నాగచైతన్య ‘థాంక్యూ’ టీజర్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఈ కామెంట్స్ వెనుక అర్థమేంటి అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఇప్పటికే నాగచైతన్య ‘మనం’ అనే చిత్రంలో నటించాడు. కేవలం నాగచైతన్యకే కాదు.. మొత్తం అక్కినేని ఫ్యామిలీకే మనం మూవీ చాలా స్పెషల్. అందుకే అక్కినేని హీరోలు ఒకరి తర్వాత ఒకరు విక్రమ్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు. అలా విక్రమ్, నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. ఇటీవల విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఈ డైలాగుని సమంత ని ఉద్దేశించి చెప్పినట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. టీజర్ ను చూసిన టాలీవుడ్ హ్యండ్సం హంక్ రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పుకొచ్చారు. రానా క్యాజువల్ గా విషెష్ చెప్పినా ఈ కామెంట్ ని సైతం సమంత, చైతు డైవర్స్ మ్యాటర్ లో కలిపేస్తున్నారు.రానా నాగచైతన్య కి పెట్టిన కామెంట్
రానా పెట్టిన పోస్టుపై ఓనెటిజన్ సందేహం వ్యక్తం చేస్తూ ఇక్కడేదో తేడా కొడుతుంది. రానా అన్న ఇన్టెన్షన్ సరి అయిపోయాడు లైఫ్ లో అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో నెటిజన్ సామ్‌ను వదిలిన దగ్గర్నుంచి సరి అయ్యాడా అని నవ్వుతున్న ఎమోజీలు పెడుతున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ సైతం సామ్ మ్యాటర్లో సైలెంట్‌గా వేశావు అంటూ కామెంట్ చేస్తున్నారు, మొత్తానికి నాగచైతన్యపై రానా వేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే రానా అసలు ఇదేమీ మనస్సులో పెట్టుకుని చెప్పి ఉండకపోవచ్చు..కానీ జనం ఎవరికి తోచినట్లు వాళ్లు అర్దాలు తీస్తున్నారు.
థాంక్యూ సినిమా పై స్పందించిన సమంతా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక విడాకులు తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా మారారు. అటుసమంతా ఫుల్ సినిమాలతో బిజీగా ఉంటే ఇటు నాగచైతన్య కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చైతన్య నటించిన కొత్త సినిమా థాంక్యూ విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరిగా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది.
ఓ వైపు నాగచైతన్య సినిమా థాంక్ యూ ట్రైలర్ రిలీజ్ అయిన క్రమంలో మరో వైపు నాగచైతన్య మాజీ భార్య సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి డిలీట్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్య ‘థాంక్ యూ’ టీజర్ చూసి సమంత రియాక్షన్ ఇచ్చిందా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ‘థోర్: లవ్ అండ్ థండర్’ మూవీ ట్రైలర్ చూసిన సమంత తన ఇన్ స్టా స్టోరిస్‌లో ‘డెడ్’ అని రాసి ఫైర్ ఎమోజీ పెట్టింది. కొద్ది సేపటి తర్వాత డిలీట్ చేసింది. అనంతరం ఈ ఫిల్మ్‌లో నటించిన క్రిస్టియన్ బాలే లుక్‌ను షేర్ చేస్తూ ‘ది గాడ్ ఆఫ్ యాక్టింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది.
మరోవైపు థాంక్ యూ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ‘మనం’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత విక్రమ్- చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘థాంక్ యూ’ కాగా, ఈ ఫిల్మ్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే క్లాస్, మాస్ గెటప్‌లో నాగచైతన్య లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ మార్క్ డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక థమన్ అందించిన నేపథ్య సంగీతం వేరే లెవల్లో ఉంది. మొత్తం మీద చైతన్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అని అనుకోనట్టునారు, ఈ సినిమా మంచి హిట్ కావాలి.