F3 Movie 1st Day Collections :
F3 సినిమా మే 27 నాడు సినిమా హాల్స్ కి రిలీజ్ అయ్యినది. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణo లో తేరక్కినది. ఈ సినిమా మొత్తం కామెడీ తో రూపొందించినది. ఈ సినిమాలో హీరోస్ గా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించడం జరిగినది, అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మేహరిన్ నటించడం జరిగినది. F2 సినిమా ఎంత బాగుందో దానికి డబుల్ గా సినిమా వచ్చింది. ఈ సినిమా మొత్తం మంచి కామెడీ గా ఉన్నదని తెలియచేసారు, ఈ సినిమాలో పాటలు, డాన్స్ సినిమా కు సంభందించినది అంత చక్కగా ఉన్నదని పేర్కొన్నారు.
చాలా యేళ్ల తర్వాత వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్ రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ మూవీ వచ్చింది. సీక్వెల్ కాదు.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సినిమా, పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి.
ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఈ శుక్రవారం ఈ సినిమాను యూఎస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1400కు పైగా విడుదలైంది. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాలు.
దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 60 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఎఫ్ 2 సినిమా మొత్తం 80 కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఎఫ్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లాభాలు కురిపిస్తుందని ఆశిస్తున్నారు.
మొదటి రోజు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాలు
- నైజాం (తెలంగాణ): రూ. 4.06 కోట్లు / రూ. 18 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ): రూ. 1.26 కోట్లు / రూ. 8.40 కోట్లు
- ఉత్తరాంధ్ర 1.18 కోట్లు / రూ. 7 కోట్లు
- ఈస్ట్ .0.76 కోట్లు / రూ. 4.50 కోట్లు
- వెస్ట్ రూ,.0.94 కోట్లు / రూ. 4 కోట్లు
- గుంటూరు 0.88 కోట్లు / రూ. 5 కోట్లు
- కృష్ణా 0.66 కోట్లు / రూ.4.50 కోట్లు
- నెల్లూరు 0.61 కోట్లు / రూ. 2.4 కోట్లు
- తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 10.35 కోట్లు (17 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు
- కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. 0.85 కోట్లు జ రూ. 3.40 కోట్లు
- ఓవర్సీస్ రూ. 2.15 కోట్లు / రూ. 5.20 కోట్లు
- ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13.35 కోట్లు / రూ. 23 కోట్ల గ్రాస్ ) రూ. 63.60 కోట్లు / రూ 64.50.
కృతజ్ఞతలు తెలియ చేసిన F3 మూవీ టీం
ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. వెంకటేశ్,దిల్‌రాజు, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్‌లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. అంతా కుటుంబసమేతంగా ఎఫ్ 3 సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఎఫ్ 3 సినిమాను థియేటర్లలో చూస్తున్న ప్రేక్షకుల స్పందన చాలా ఆనందం కల్గిస్తుందన్నాడు వెంకటేశ్. అనిల్ రావిపూడికి, చిత్ర యూనిట్‌కు వెంకటేశ్ అభినందనలు తెలిపాడు.
F3 మూవీ విషయంలో ప్రతిచోటా బ్లాక్ బస్టర్ మాటే వినిపిస్తోంది అని ఇంతటి విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఎఫ్ 3 సినిమా రెండేళ్ల కష్టమైన ప్రయాణo లోస్టార్ ఇమేజ్ కలిగి వెంకటేశ్ ఇంత కామెడీ పండించడం చాలా గొప్ప విషయమని తెలియచేసారు. అటు వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉందన్నాడు. వెంకటేశ్ తో ఇంతకుముందు సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు కాగా ఇప్పుడు ఎఫ్ 3తో హ్యాట్రిక్ విజయమని దిల్‌రాజు గుర్తు చేసుకున్నాడు.
F3 మూవీ OTT లో రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే
F3 మూవీ ఓటీటీ హక్కుల విషయంలో డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమా హక్కుల్ని ఏకంగా 18 కోట్ల రూపాయలకు సోనీ లివ్ దక్కించుకున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ సైతం ఈ సినిమా కోసం పోటీపడినా సోనీ లివ్ 18 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల కావల్సి ఉంది. వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీ హక్కులు 20-30 కోట్లు పలుకుతుంటాయి. అంటే ఎఫ్ 3 సినిమాకు మంచి డీల్ లభించినట్టేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది ఇంకా స్పష్టత రాలేదు. OTT లో సినిమా రిలీజ్ డేట్ ఇంకా స్పష్టంగా తెలియచేయలేదు, ఒకవేల మకి సంచారం అందితే మీకు తెలియచేస్తాము.