టోలివుడ్ హీరోయిన్ అయ్యిన కాజల్ ఎన్నో తెలుగు సినిమాలు తీయడం జరిగింది. హీరోయిన్ గా తన కంటూ మంచి పేరుని సంపాదించుకొంది. కాజల్ తెలుగు లోనే కాదు అన్ని భాషలలో తను నటించడం జరిగింది. తన లైఫ్ లో మంచి సక్సెస్ ని సాధించింది. ఎన్నో సినిమాలలో నటించింది, కొంత మంది హీరోలతో నటించింది మరికొంత మందితో కాజల్ నటించలేదు.
అయితే కాజల్ ఈ మధ్యనే వివాహం చేసుకొన్నా విషయం మన అందరికి తెలిసినదే. ఆ వివాహం ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగినది, వివాహానికి కూడా నటినటులు హాజరు అయినారు, మరికొంత మంది ప్రముకులు హాజరు అయినారు. వివాహం లో వధూవరులు తమ పెళ్లి లో బాగా ఎంజాయ్ చేసారు. పాటలు, డాన్స్ ఇలా అందరు బాగా వివాహం లో ఆనందంగా ఉన్నారు. ఇక తాజాగా ఆమె ఓ మగబిడ్డకు తల్లైంది. ఈ విధంగా తాజాగా ఆమె గతంలో ఎన్నడూ చూడని ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, డెలివరీ సమయంలో ఎదుర్కొన్న బాధలు కూడా తెలియచేసింది.
వివాహం తర్వాత సినిమాలు కొద్ది రోజులు ఫుల్ స్టాప్ పెట్టిన కాజల్ :
చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో హవాను చూపించింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. అలాగే, ఆఫర్లు కూడా ఆమెకు సన్నగిల్లాయనే చెప్పుకోవాలి. దీంతో ఆమె అభిమానులు నిరాశగా ఉండిపోయారు.
ప్రేగ్నేట్ అయ్యినక సినిమాలకు దూరం :
కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. అలాగే, మరొకొన్నింటిని ఒప్పుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల నుంచి కూడా ఆమె తప్పుకుంది కూడా
కాజల్ పండంటి బిడ్డకు జన్మనించింది :
వివాహం తర్వాత స్పీడు తగ్గించిన కాజల్ అగర్వాల్.. ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. అతడితో అన్యోన్యంగా ఉంటూ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
కాజల్ కొడుకు పేరు “నీల్ కిచ్లూ ” :
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. నీల్ అంటే విజేత అని అర్థం వస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతమ్ ‘మాకు నీల్ జన్మించాడని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. చిన్నారిని ప్రేమతో మా కుటుంబ సభ్యులు అంతా స్వాగతిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
ఫొటోతో కాజల్ స్పెషల్‌గా :
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరోయిన్ బేబీ బంప్‌తో ఉన్న హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, తన డెలివరీ సమయంలో ఎదురైన పరిణామాల గురించి ఓ నోట్‌ను కూడా వదిలింది.
కాజల్ కు నిద్రలేని రాత్రులు.. సమస్య :
డెలివరీ సమయంలో కాజల్ ఎదుర్కొన్న సమస్యలను కూడా వివరించింది. ‘వాస్తవానికి డెలివరీ అనేది అంత సులభం కాదు. మూడు నిద్రలేని రాత్రులు, తెల్లవారుజామున రక్తస్రావం, సాగిన చర్మం, ఘనీభవించిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంపులు, అన్నిటికీ మించి టెన్షన్ ఇవన్నీ నన్ను ఆందోళనకు గురి చేశాయి. కానీ, డెలివరీ తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
- కేజీఎఫ్: చాప్టర్-2 మూవీ కలెక్షన్స్ బాహుబలి సినిమా రికార్డ్స్ బ్రేక్ !
- రణబీర్ కపూర్, అలియబాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్
- శంకర్ ప్రాజెక్ట్ ను తిరస్కరించిన మోహన్ లాల్, షాక్ లో చరణ్