మొదటి సారిగా కూచిపూడి డాన్స్ చేసిన మహేష్ కూతురు సితార

మహేష్ బాబు  గురించి :  మహేష్  బాబు మంచి సినిమాలతో ముఖ్యం గా తన నటనతో అందర్నీ ఆకట్టు కొంటాడు. తను నటించిన ముఖ్యమైన సినిమాలు దూకుడు, ఒక్కడు, మురారి, పోకిరి, మహర్షి ,భరత్ అనే నేను, సరిలేరు నీ కెవ్వరు, వంటి సినిమాలతో అందర్నీ అలరించాడు.  రీసెంట్ గా రాబోతున్న సర్కారు వారి పాట ద్వారా  వస్తునాడు.

సినీ న‌టుడు మ‌హేశ్ బాబు కూతురు సితార తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకొంది.  దీనికి సంభందించిన  వీడియెను మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. సితార తొలి సారిగా చక్కగా చేసిన డాన్స్ ఇది అని మహేష్ బాబు సంతోషంతో పోస్ట్ చేసాడు. అది కూడా ప్రత్యేకమైన శ్రీ రామ నవమి నాడు అందరికి చూడడం చాల సంతోషముగా ఉంది అని ట్వీట్ చేసాడు.

నా కూతురు మొదట నుంచి ఎన్నో సిని గీతాలకు డాన్స్ చేసిన విషయం అందరికి తెలిసింది  కానీ ఇది మా కుటుంబానికి చాల సంతోషాన్ని ఇచ్చే విషయం ఎందుకంటే ఇది మన సాంప్రదాయ నృత్యం కనుక మాకు చాల ఆనందాన్ని ఇచ్చింది అని ట్విట్టర్ లో తెలియ చేసాడు.

ఈ సమయం లో నే తను సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. సర్కారు వారి పాట ద్వారా పెన్నీ అనే సాంగ్ లో తాను డాన్స్ చేసి సినిమాల్లో అడుగు పెట్టింది.

Leave a Comment