ప్రశాంత్ కిషోర్ ఈయన పేరు ఈపుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పెద్ద సమస్య గా మారింది. ఎందుకంటే ఇతను పార్టీ లో కి వస్తాడో లేదో తెలిదు కాని ఈయనకు ఇచ్చే మంత్రి పదవిలు మాత్రం చర్చనియం అంశం గా మారింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ కంపెనీ అధిపతి ప్రశాంత్ కిషోర్ వరుస సమావేశాలు కావడం, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఏం చేయాలో చెప్పే వివరణాత్మక నివేదిక, ప్రదర్శన ఇవ్వడం చూశాం.
దాంతో చాల మంది పీకే కాంగ్రెస్ లో చేరి మంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఇది మారిపోయేలా ఉంది. ఎన్నికల గెలుపునకు, పార్టీ సంస్కరణకు సోనియా ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపు పేరుతో ఒక కమిటీ వేయగా, అందులో చేరాలని సోనియా కోరడంతో పీకే అందుకు ఒప్పుకోలేదు.
2024 లోక్ సభ ఎన్నికలపైనే పీకే ద్రుష్టి పెట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఏడాది చివర, వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మాత్రమే పని చేయాలనీ పీకేను కోరుతోంది.
ప్రియాంకాగాంధీని పార్టీ చీఫ్ గా చేయాలన్నది పీకే అభిమతంగా తెలుస్తోంది. ఆమెను అధ్యక్షురాలిని చేసి, కీలక బాధ్యతలు తాను తీసుకుంటే వెనుక నుంచి చక్రం తిప్పొచ్చన్నది పీకే వ్యూహంగా ఉందని అంటున్నారు.