ఫారమ్ 16 గురించి పరిచయం | Form 16 introduction
Form 16 introduction In Telugu:- ఫారమ్ 16 అనేది ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫిల్ చేయడానికి అవసరమైన అన్ని వివరాలను కలిగి ఉన్న పత్రం. యజమానులు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఉద్యోగులకు ఫారం 16 అందిస్తుంది. ఈ ఫామ్ 16 సహాయంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. దీనితో పాటు ఆదాయానికి సంబంధించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఆదాయ వివరాలను పన్ను వర్తించే లేదా వర్తించని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ), 80 సి సెక్షన్ కింద సేవింగ్స్ (పీపీఎఫ్, ఈపీఎఫ్, బీమా లాంటివి) వాటిని వెల్లడించి, వాటి ఆధారాలను సమర్పిస్తుంటారు.
ఫారమ్ 16 ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి | How To Download form 16
- ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసి https://www.incometaxindia.gov.in/Pages/default.aspx అని టైపు చేసి ఎంటర్ చేయండి.
- చేసిన తర్వత మీకు ఒక బాక్స్ వస్తుంది.
- ఆ బాక్స్ లో మీ యొక్క PPOID,PAN NO రెండిటిలో ఏదో ఒకటి అక్కడ ఎంటర్ చేసి submit చేయండి.
- చేసిన తర్వాత మీకు దానికి సంభందించిన ఫారం 16 న్యూ పేజి ఓపెన్ అవుతుంది.
- వచ్చిన పేజిలో ఆ ఫారం 16 డౌన్ లోడ్ అయ్యిన తర్వత మీకు సంభందించిన వివరాలు అన్ని ముందుగానే అందులో ఉంటాయి.
- ఒకవేళ మీ యొక్క వివరాలు తప్పుగా ఉంటె కరెక్ట్ చేసుకొని ఆ ఫారం 16 ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ విధంగా ఫారం 16 డౌన్లోడ్ చేసుకోవడం.
ఫారం 16 వెబ్ సైట్ | Form 16 Web Site
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి. (https://www.incometaxindia.gov.in/Pages/default.aspx).
ఫారం 16 రైల్వే ఉద్యోగులకి ఏ విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి | How To Download Railway Employees
ఫారమ్ 16ని మీ యజమాని మాత్రమే డౌన్లోడ్ చేసి జారీ చేయగలరు . ఏ వ్యక్తి అయినా అతని/ఆమె ఫారమ్ 16ని డౌన్లోడ్ చేసుకోలేరు. ఒక వ్యక్తి పాన్ నంబర్ని ఉపయోగించి TRACES వెబ్సైట్లో ఫారమ్ 16ని డౌన్లోడ్ చేస్తారనే సాధారణ అపోహ ఉంది.
- ఫారమ్‌లు/డౌన్లోడ్’ విభాగం కింద, మీరు ‘ఆదాయ పన్ను ఫారమ్‌లు’ ఎంపికను కనుగొంటారు, దానిపై క్లిక్ చేయండి.
- తర్వాత, మీరు ‘ఫారమ్ 16’ క్రింద అందుబాటులో ఉన్న ‘PDF’ మరియు ‘Fillable Form’ ఎంపికలను కనుగొంటారు.
- సంబంధిత ఎంపికపై క్లిక్ చేయండి.
- మీరు తదుపరి పేజీలో ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోగలరు.
TRACES నుండి ఫారమ్ 16ని డౌన్లోడ్ చేయడానికి విధాలు ( How To Download TRACES From 16 ) :
- ముందుగా మీరు TRACESకి లాగిన్ చేయండి.
- డ్యాష్‌బోర్డ్ నుండి డౌన్లోడ్లకు నావిగేట్ చేయండి.
- ఆర్థిక సంవత్సరం మరియు పాన్‌ను ఎంచుకోండి.
- అధీకృత వ్యక్తి వివరాలు.
- KYC ధ్రువీకరణ కోసం కింది వాటిలో దేనినైనా ఎంచుకోండి.
- ఎంపిక 1: DSCని ఉపయోగించి KYC ధ్రువీకరణ.
- డిజిటల్ సిగ్నేచర్ KYC – ఎంపిక 1.
- డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఎంపిక. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం.
ఇవి కూడా చదవండి :-