IPL 2022 ఇండియన్ ప్రీమియం లీగ్ అంటేనే గుర్తుకు వచ్చేది ఏంటి, RCB ఈ టీం కి ఉన్ననంత ఫాన్స్ ఇంకా వేరే ఏ టీమ్స్ కి ఇంత మంది ఫాన్స్ లేరు. ఈ టీం కే చాల మంది ఉన్నారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ గుజరాత్ పై బెంగళూరు విజయంసాధించింది. అయితే RCB ఇన్ని టీమ్స్ తో ఆడి గెలిచినా చివరికి ముంబై ఈ పరిస్థితిలో ఖచ్చితంగా గెలవాలి, ఈ టీంకి విరాట్, డుప్లెసిస్ సపోర్ట్ చేస్తున్నారు.
IPL 2022 సీజన్ ప్లేఆఫ్స్ సమీకరణాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకి ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారవగా ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో ఉన్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్‌కి కూడా ఓ బెర్తు ఖాయమే. కానీ మిగిలిన ఒక బెర్తుపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
గుజరాత్ టైటాన్స్‌పై గురువారం రాత్రి గెలిచిన బెంగళూరు టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ని వెనక్కి నెట్టి 16 పాయింట్లతో నెం.4 స్థానానికి ఎగబాకింది. దాంతో ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నసన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోన్నాయి.
ఇక శనివారం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్‌లో ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే, అప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ప్రస్తుతం నెం.4లో ఉన్న బెంగళూరు టీమ్ నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఇంటిబాట పట్టనుండగా ఢిల్లీ క్యాపిటల్స్ నెం. 3 లేదా నెం.4 స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనుంది. దాంతో శుక్రవారం ముంబయి గెలవాలని ఆర్సీబీ కోరుకుంటోంది. ఢిల్లీ ఓడితే ఫ్రీ గా బెంగళూరు ప్లేఆఫ్స్‌కి వెళ్లనుంది.