IPL 2022 : IPL మ్యాచ్స్ అంటేనే ఒక అందరి లోను ఒక ఉస్తాహం వస్తుంది. అయితే రానున్న ఈ మ్యాచ్ లకు ఒక బాయ్ చెప్పుతుంది ఫైన్నాల్ మ్యాచ్, ఇన్ని రోజులు వారికి నచ్చిన టీం ని బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్ని టీమ్స్ లో కేవలం రెండు టీమ్స్ మాత్రమే ఫైన్నాల్ కి చేరుతుంది. మిగిలిన అన్ని టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటది.
IPL ఈ లీగ్ చివరి దశకు చేసుకొన్నది, గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్లే ఆఫ్ బెర్తులు చివరి మ్యాచ్ వరకు వెళ్లాయి. ఇప్పటి రెండు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా మూడు, నాలుగు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ రెండు రోజుల్లో ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఆదివారం మే 29 అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
IPL 2022లో రెండు మ్యాచులు ఉంటే మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ మే 29న రాత్రి 7.30 గంటలకు మొదలవ్వాల్సి ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని బీసీసీఐ వర్గాలు తెలియచేసారు టాస్ 7.30 గంటలకు పడాలి.
IPL 2022 ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్బజ్ తమకథనంలో తెలియచేసారు. ముగింపు రోజున అదనపు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను అద్భుతంగా నిర్వహించాలని బీసీసీఐ పేర్కొన్నది.
ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారని తెలుస్తోంది. ముగింపు వేడుకలు సాయంత్రం 6:30కు మొదలై దాదాపుగా 40 నిమిషాల పాటుకొనసాగుతాయి.
IPL 2022 లీగ్ స్థాయిలో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు జరుగుతాయి. మే 24 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి.
కోల్కతాలో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగనుండగా, అహ్మదాబాద్లో ఫైనల్ జరుగనుంది.ఈ సరి ఏ జట్టు IPL కప్ కొడుతుందో వేచి చూడాల్సిందే.