IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి జరిగిన కోల్‌కతా, సన్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42; 26 బంతుల్లో 8×4), రోవ్‌మెన్ పొవెల్ (33 నాటౌట్; 1×4, 3×6), అక్షర్ పటేల్ (24) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా హృతీష్ రాణా, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే పృథ్వీ షా(0) ఔట్ అయ్యాడు. మూడో ఓవర్‌లో మిచెల్ మార్ష్ (13) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ (22)తో కలిసి డేవిడ్ వార్నర్ జట్టును అందుకొన్నాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. అయితే డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసిన ఉమేష్ యాదవ్ మూడో వికెట్‌ను పడగొట్టాడు.
ఆ వెంటనే లలిత్ యాదవ్‌ను సునీల్ నరైన్ ఔట్ చేయగా కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు.
అయితే అక్షర్ పటేల్ రోవ్‌మన్ పొవెల్‌తో కలిసి విలువైన రన్స్ చేసి రనౌటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ 8 నాటౌట్ తో కలిసి పొవెల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓటమితో కోల్‌కతాప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. విజయం సాధించిన ఢిల్లీ 8 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
డేవిడ్ వార్నర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మూడో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే నరైన్.. లలిత్ యాదవ్‌ను ఔట్ చేయగా రిషభ్ పంత్‌ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. 2 పరుగుల వ్యవధిలోనే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 2 ఫోర్లు, సిక్సర్‌తో జోరు కనబర్చాడు. అయితే రోవ్‌మన్ పొవెల్‌తో సమన్వయ లోపం కారణంగా అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(8 నాటౌట్)తో కలిసి రోవ్‌మన్ పొవెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.