ఒడి దుడుకులు సహజం కాని ఆటలో మాత్రం మార్పు !

రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మరోసారి విఫలమైన సంగతి అందరికి  తెలిసిందే. కాగా రాజస్థాన్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో రెండుసార్లు గోల్డెన్‌ డక్‌ అవుట్ ఉండడం విశేషం. దీంతో కోహ్లి పని అయిపోయిందని, కోన్ని మ్యాచ్‌లకు రెస్ట్‌ ఇస్తే అన్ని సర్దుకుంటాయని మాజీ క్రికెటర్లు సహా ఫ్యా‍న్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి ఫామ్‌పై తమకు ఆందోళన లేదని ఇది మాకు అలవాటేనని ఆర్‌సీబీ హెడ్‌కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు.

కోహ్లి ఆట పై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి అతను ఒక గొప్ప క్రికెటర్‌. ఇంతకముందు కూడా ఇలాంటి ఒడి దుడుకులు చాలానే చూశాడు. నేను కోహ్లిని చాలా దగ్గర్నుంచి చూసాను, కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసిన తర్వాత మ్యాచ్ లలో బాగా ఆడిన సందర్బాలు చాల ఉన్నాయి.

అంత మాత్రానికి తనను జట్టు లో నుంచి తీసివేయడం జబాబు కాదు అని కొంత మంది క్రికెట్ పండితుల అభిప్రాయం. కోహ్లికి ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. డుప్లెసిస్‌కు సరైన జోడి కోహ్లినే అని అభిప్రాయపడి ఓపెనింగ్‌ స్థానంలో అతన్ని పంపించాం.

ఇక కోహ్లి మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్‌, కార్తిక్‌, షాబాజ్‌ అహ్మద్‌ అంతా ఫామ్‌లో ఉన్నారు. ఏదో ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తప్పుపట్టటడం సరి కాదు. మా జట్టులో ఇప్పుడు ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసే సమర్థులు ఉన్నారు. ఇది మాకు బలం అని చెప్పొచ్చు. అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్‌సీబీ తర్వాత మ్యాచ్‌ను ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

Leave a Comment