ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. వరుస విజయాలతో అన్ని టీంల కన్న ముందు వరుసలో ఉంది. ఎవ్వరెదురొచ్చినా తొక్కి పడేస్తోంది. మొదటి రెండింట్లో ఓడిపోయిన తరువాత మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన గెలుపుతో సన్‌రైజర్స్ వరుసగా విజయాలకు తెరతీసింది.
వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలుచుకుంది, ఇవ్వాళ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక కాగా. ఈ మ్యాచ్ లో గుజరాత్ తో సన్ రైజేర్స్ కు ఇది రెండవ మ్యాచ్. ఫస్ట్ హాఫ్‌లో తన నాలుగో మ్యాచ్‌ను గుజరాత్‌తో ఆడి గెలిచింది సన్ రైసేర్స్ . సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది.
మరోసారి హార్దిక్ పాండ్యా, అతని జట్టును ఓటమి రుచి చూపించడానికి సందర్భంగా ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే- పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ మూడో స్థానంలో ఉంది. ఇక విషయానికి వస్తే సుందర్ తిరిగి ఉన్ రైసేర్స్ లో జాయిన్ కాబోతున్నాడు. గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడు ఆల్‌రౌండర్. ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ అయ్యాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా ప్రాక్టీస్ చేశాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీష సుచిత్/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఆడే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ దయాళ్ చోటు దక్కించుకోవచ్చు.