ప్రస్తుతం ipl మ్యాచ్ లు జరుగుతున్న విషయం మన అందరికి తెలిసిన విషయమే, ఒక్కో రోజు ఒక్కో టీం ఆడడం జరుగుతుంది, అనీ టీమ్స్ చాల ఆట అడుతున్నారు, మ్యాచ్ లలో వారి ఎవరి వారి స్టైల్ బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, అడుతున్నారు, నిన్న జరిగిన మ్యాచ్ లక్నోV/S రాజస్తాన్ మ్యాచ్ ఆడడం జరిగింది. నిన్న ఆడిన మ్యాచ్ లో లక్నో విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు కావాలి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తన మాస్టర్ ఐడియా తో లక్నోని ఆదివారం రాత్రి ఓడించేశాడు. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ 165 పరుగులు చేయగా ఛేదనలో లక్నో టీమ్ 162/8కే పరిమితమైంది. చివరి ఓవర్లో లక్నో జట్టు విజయానికి 15 పరుగులు కావాలి కొత్త బౌలర్ కుల్దీప్ సేన్ చేతికి బంతినిచ్చిన సంజు శాంసన్ వికెట్ల వెనుక నుంచి సైగు చేస్తూ కనిపించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ కుల్దీప్ సేన్.. మ్యాజిక్ చేసి రాజస్థాన్ని గెలిపించాడు.
నిజంగా చెప్పాలంటే లక్నో టీమ్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ప్రసీద్ బౌలింగ్‌లో పవర్ హిట్టర్ మార్కస్ స్టాయినిస్ <38 నాటౌట్: 17 బంతుల్లో 2×4, 4×6.> రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి మొత్తం ఆ ఓవర్లో 19 పరుగుల్ని గట్టిగ కొట్టినాడు. దాంతో సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులతో ఈజీ గా మారిపోయింది మరోవైపు ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ చేతికి సంజు శాంసన్ బంతినిచ్చాడు. దాంతో రాజస్థాన్ అభిమానుల్లో భయం మొదలైంది కానీ చివరి ఓవర్లో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ సేన్ రాజస్థాన్ని గెలిపించాడు. అతను వేసిన వైడ్ యార్కర్లని హిట్ చేయడంలో స్టాయినిస్ ఓడిపోయాడు.
ఐపీఎల్లో అనుభవం లేని కుల్దీప్ సేన్‌ని అదీ భవిషత్ లో తొలి మ్యాచ్ ఆడుతుండగా చివరి ఓవర్‌ని అతనితో బౌలింగ్ వేయడం తో పై మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో అప్పటికే అతను మూడు ఓవర్లు వేసి కేవలం 24 పరుగులే ఇచ్చాడు. దాంతో.. ఆఖరి ఓవర్లోనూ అతను మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించాను. ఆ ఓవర్‌కి ముందు కుల్దీప్ సేన్‌తో మాట్లాడినప్పుడు.. అతను కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. సీజన్లో డెత్ ఓవర్లలో వైడ్ యార్కర్లు వర్కవుట్ అవుతున్నాయి. కాబట్టి.. అదే ప్లాన్‌తో వెళ్లాం. కుల్దీప్ సేన్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ టోర్నీలో ఆ వైడ్ యార్కర్లని సమర్థంగా వేయడాన్ని నేను చూశాను’’ అని సంజు శాంసన్ తెలియచేసారు.