ఈ tips పాటిస్తే ఎలాంటి పంటి నొప్పి అయిన చిటికెలో మాయం !

పంటి నొప్పి పోవాలంటే ఏం చేయాలి| Panti Noppi Povalante Yem cheyali In Telugu 

చాలా మంది పంటి నొప్పితో బాధ పడుతుంటారు. ఈ పంటి నొప్పి అనేది ఏది పడితే తినటం వలన వస్తుంది. కొన్ని సార్లు ఇతర కారణాల వలన కూడా ఈ పంటి నొప్పి వస్తుంది. ఒక్కోసారి పంటి నొప్పి ఎక్కువగా  ఉంటె పంటిని తొలగించడం జరుగుతుంది. పంటి నొప్పిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవిఎంటో ఇపుడు చూద్దాం.

పంటి నొప్పి పోవాలంటే చిట్కాలు| Panti Noppi Povalante Chitkalu In Telugu   

మనం కొన్ని చిట్కాలను పాటిస్తే పంటి నొప్పి తగ్గుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • వెల్లుల్లి :-

పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. వెల్లుల్లి,లవంగాలను  తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నా మిశ్రమాన్ని నొప్పి ఉన్న పంటి దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన వెల్లుల్లి నుంచి రసం వస్తుంది. ఆ రసం వలన పంటి నొప్పి తగ్గుతుంది. ఈ పేస్ట్ వలన పంటి నొప్పియే కాక దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గుతాయి.

పంటి నొప్పి తగ్గడానికి ఏం చేయాలి

  • ఐస్ ముక్కలు :-

పంటి నొప్పి ఉన్న చెంపపై పది లేదా పదహైదు నిముషాలు ఐస్ ముక్కలను ఉంచాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయటం వలన పంటి నొప్పి తగ్గుతుంది.

పంటి నొప్పి తగ్గడానికి చిట్కాలు చెప్పండి

  • బ్లాక్ పెప్పర్ (మిరియాల పొడి ) :- 

పంటి నొప్పి ని తగ్గించడానికి బ్లాక్ పెప్పర్ కూడా  సహాయపడుతుంది. నొప్పిగా ఉన్న పంటి చిగురుపై మిరియాల పొడి రుద్దుకోవాలి. ఇలా చేయటం వలన నొప్పి ఉన్న చోట తిమిరిగా మారుతుంది. దాని వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

పంటి నొప్పి తొందరగా తగ్గాలంటే ఏం చేయాలి

  • వీట్ గ్రాస్ జ్యూస్ :-

గోధుమ గడ్డి రసం దంత క్షయం కోసం ఒక మౌత్ వాష్ గా  ఉపయోగిస్తారు. ఇది చిగుళ్ళ నుంచి క్రిములను, బ్యాక్టీరియాను బయటకు పంపటానికి సహాయపడుతుంది. కాబట్టి దీనిని తీసుకోవటం వలన పంటి నొప్పి చాల వరకు తగ్గుతుంది.

పంటి నొప్పి నివారణ

  • ఆవ నునే మరియి ఉప్పు :-

అవనునేలో కొంచం ఉప్పు కలుపుకొని నొప్పి ఉన్నచోట రాసుకోవాలి. ఆవ నూనె లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గిస్తాయి.

పంటి నొప్పి తగ్గాలంటే

  • పుదీనా టీ :- 

ఒక టీస్పూన్ పుదీనా ఆకులను తీసుకొని, ఒక కప్పు నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంత చల్లారిన తర్వాత ఆ నీటితో పుక్కలించుకోవాలి,లేదా తాగాలి.ఇలా చేయటం వలన పంటి నొప్పి తగ్గుతుంది.

పంటి నొప్పి ఆయుర్వేదం

  • విస్కీ :- 

మూడు లేదా నాలుగు చుక్కలు విస్కీని కాటన్ లోకి తీసుకోవాలి, ఇలా తీసుకున్న దానిని నొప్పి ఉన్నచోట నొక్కి పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన నొప్పి ఉన్న చోట తిమ్మిరిగా మారి నొప్పి తగ్గుతుంది.

పంటి నొప్పి ఆయుర్వేదం

గమనిక :- పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహనా కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు పంటి నొప్పి సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment