చెవి నొప్పి పోవాలంటే ఏం చేయాలి | Chevi Noppi Povalante Yem Cheyali In Telugu
చెవికి వచ్చే సమస్యలు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చెవి నొప్పి. ఈ చెవి నొప్పిని మనము ఏదో ఇక సమయంలో ఎదుర్కొంటము.చెవి నొప్పిని మనము చిన్న సమస్యగానే చూస్తాం.కాని దాని నుంచి వచ్చే బాధ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ చెవి నొప్పి వచ్చినప్పుడు కొంత సేపు కూడా ప్రశాంతంగా ఉండలేరు. నొప్పిని తట్టుకోవటానికి చాలా చిట్కాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
చెవి నొప్పి పోవాలంటే చిట్కాలు | Chevi Noppi Povalante Chitkalu In Telugu
చెవి నొప్పి అకస్మాతుగా వచ్చినప్పుడు మనం కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ నొప్పిని కొంత వరకు తగించుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- తులసి ఆకులు :-
చెవి నొప్పికి తులసి ఆకులు బాగా పని చేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని, వాటిని మెత్తగా దంచి రసాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న రసాన్ని చెవిలో వేసుకోవాలి. ఇలా చేస్తా కోన్ని క్షణాల్లోనే మనకు చెవి నొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వలన చెవి నొప్పియే కాకుండా ఇంకా చెవిలో ఏదైన ఇన్ఫెక్షన్ ఉంటె అది కూడా కొంత తగ్గుతుంది.
- ఉప్పును కాపుకోవడం :-
చెవి నొప్పిని తగ్గించడంలో ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు తీసుకొని, దానిని వేయించుకోవాలి, తర్వాత వేడిగా ఉన్న ఉప్పును ఒక బట్టలోకి తీసుకొని ముటకట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉప్పును తీసుకొని నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవాలి.ఇలా చేస్తే చెవి నొప్పి తగ్గుతుంది.
- ముక్కును క్లియర్ చేసుకోవడం :-
కొంత మందికి ముక్కు మూసుకుపోవడం వలన కూడా చెవి నొప్పి వస్తుంది. దీనిని మనం జలుబు నుంచి వచ్చే చెవి నొప్పిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చెవి నొప్పి పోవాలంటే ముందుగా మనం ముక్కును క్లియర్ చేసుకోవాలి. ముక్కు క్లియర్ కావటానికి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయటం వలన చెవి నొప్పి దానింతట అదే మెల్లగా తగ్గుతుంది.
- ఆలివ్ ఆయిల్ :-
ఆలివ్ ఆయిల్ కూడా చెవి నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని తీసుకొని, దానిని ఒక బౌల్ లో గోరు వెచ్చగా వడి చేసుకోవాలి. తర్వాత ఆ ఆయిల్ ని రెండు లేదా మూడు చుక్కలు నొప్పి ఉన్న చెవిలో వేసుకోవాలి. ఇలా చేయడం వలన చెవిలో వెచ్చదనం కల్గుతుంది. తద్వారా చెవి నొప్పి తగ్గుతుంది.
- విగ్లింగ్ :-
చెవిని లాగటం,పెద్దగా అవిలించడం, చేతితో అటు ఇటు తిప్పటం వలన కూడా చెవి నొప్పి తగ్గుతుంది. ఇలా విగ్లింగ్ చేయటం వలన చెవిలో ఉండే రంద్రాలు పెద్దగా అవుతాయి. అప్పుడు లోపలి గాలి వెళ్తుంది. ఇలా గాలి వెళ్ళటం వలన చెవి నొప్పి నుంచి మనకు కొంత ఉపసమనం లభిస్తుంది.
- చెవిలో ఏవి అంటే అవి పెట్టకుండా ఉండటం :-
చాలా మందికి చెవిలో కాటన్ ఇయర్ బడ్స్ ని వేసి తిప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ చెవి నొప్పి ఉన్నపుడు ఇలా చేయకూడదు. ఇలా చేయటం వలన చెవిలోకి మరింత దుమ్ము చేరే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి చెవి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి చెవి నొప్పి ఉన్నప్పుడు చెవిలో ఏవి అంటే అవి పెట్టి తిప్పకూడదు.
గమనిక :- పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహనా కోసం ఇవ్వడం జరిగింది. మీకు చెవి నొప్పి సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి