కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి

కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి|Kidnilo Rallu Povalante Yem Cheyali In Telugu

కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తాయి. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయం కూడా చేస్తాయి.కిడ్నిలో రాళ్ళు ఏర్పడటం వలన అవి చేసే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కిడ్నీలో  రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరిక్ ఆమ్లం,పాస్పరస్,కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు కిడ్నీలలో పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు.

కిడ్నీలో రాళ్ళు పోవాలంటే చిట్కాలు|Kidnilo Rallu Povalante Chitkalu In Telugu

మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకోవటం వలన కిడ్నిలో రాళ్ళను తగ్గించుకోవచ్చు మరియు  తొలగించుకోవచ్చు.ఈ క్రింద కిడ్నిలో రాళ్ళు తగ్గటానికి కొన్ని చిట్కాలు ఇవ్వటం జరిగింది.అవి ఎంటో తెలుసుకొందాం.

  • నీటిని ఎక్కువగా తాగటం 

శరీరంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి  నీరు ఎక్కువగా తాగటం ఎంతో అవసరం.మనం రోజు తాగే ఇతర పనియలతో పాటు మంచి నీరుని ఎక్కువగా తాగాలి.కనీసం ఒక గంటకి ఒక గ్లాస్ నీరు తాగాలి. నీటిని ఎక్కువగా తాగటం వలన కిడ్నిలో రాళ్ళు తొందరగా తగ్గుతాయి.

కిడ్నీలో రాళ్లు

  • కిడ్ని బీన్స్  

కిడ్ని బీన్స్  కిడ్నిలో రాళ్ళను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్ ని 6 గంటలు ఉడికించి, ఒక గంట చల్లపరుకుకొని, వాటిని  వాడకోట్టుకొని ఆ నీటిని త్రాగుతూ ఉండాలి. కిడ్నీ బీన్స్‌లోని ఫైబర్ కిడ్నిలోని  రాళ్లను బయటకు తీయడానికి సహాయపడుతుంది.

kidni beans

  • తులసి ఆకులు 

ఎండ పెట్టిన తులసి ఆకులను 1 దేబుల్ స్పూన్ తీసుకొని వేడినీటిలో వేసుకోవాలి. అలా చేసుకున్నా నీటిని రోజుకు మూడు సార్లు త్రాగాలి. ఆ తులసి ఆకుల నీరు ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది కిడ్నిలో రాళ్ళను తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

రామ-తులసి

  • దానిమ్మ జ్యూస్ 

దానిమ్మ జ్యూస్ మరియు విత్తనాలు కిడ్నిలో రాళ్ళను మరియు కిడ్ని నొప్పులను తగ్గించడానికి బాగా పని చేస్తాయి. దానిమ్మలో  పుల్లని మరియు కాస్టిక్ విశిష్ట లక్షణాలు ఉంటాయి. దీనిని రోజు తాగటం వలన కిడ్ని సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

దానిమ్మ జ్యూస్

  • నిమ్మకాయ జ్యూస్ (నీళ్ళు )

నిమ్మకయలో సిట్రేట్ ఉంటుంది.ఇది కిడ్నిలో రాళ్ళను తగ్గించాడానికి ఎంతగానో దోహదపదుతుంది. నిమ్మకాయ నీళ్ళను రోజు తాగటం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే ఏం తినాలి

  • పుచ్చకాయ 

పుచ్చకాయలో పొటాషియం అనే మూలకం ఉంటుంది.అంతేకాకుండా పుచ్చకాయ అనేది లిక్విడ్ పండు. దీన్ని తినటం వలన  మూత్రవిసర్జన వ్యవస్థ బాగా పనిచేస్తుంది.మరియు కిడ్నిలో రాళ్ళకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

కిడ్నీలో రాళ్లు లక్షణాలు

కిడ్నిలో రాళ్ళు ఉంటె వాటి లక్షణాలు |Kidnilo Rallu Uunte Vaati Lakshanalu In Telugu 
కిడ్నిలో రాళ్ళు ఉంటె మీ శరీరంలో ఈ లక్షణాలు  కనిపిస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. పక్కటెముకల  క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి రావటం.
  2. మూత్ర విసర్జన చేసేటప్పుడు కష్టంగా, లేదా నొప్పిగా ఉండడం.ఇది ప్రారంభ దశలో ఉంటుంది.
  3. తరచుగా మూత్రవిసర్జన చేయాలని  అని అనిపించడం.
  4. వికారం మరియు వాంతులు అవ్వటం
  5. సాధారణం కంటే తక్కువ  మూత్రవిసర్జన అవ్వటం 
  6.  జ్వరాలు, చలి, ఎక్కువగా రావటం
  7. దుర్వాసనతో కూడిన మూత్రం రావటం
  8.  హెచ్చుతగ్గులకు లోనయ్యే కడుపు  నొప్పి రావటం
  9. పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో  మూత్రం రావటం 

గమనిక :-

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహనా కోసమే. మీకు కిడ్ని సమస్యలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి

ఇవి కూడా చదవండి 

Leave a Comment