నిద్ర పట్టడానికి చిట్కాలు !

నిద్ర పట్టడానికి చిట్కాలు | Nidra Ravadaniki Tips In Telugu

నిద్ర పట్టడానికి చిట్కాలు :-  మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం రోజులో 8 గంటలు నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో మనిషి కాలం వెంట పరుగెడుతూ ఉన్నాడు. ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు గంటలకొద్దీ గడిపి కూడా ఇంటికి వచ్చాకా టీవీ, మొబైల్ చూస్తూ  బిజీ అయిపోతున్నారు.

ఇలా చేయటం వలన వారికీ నిద్ర పట్టకపోవచ్చు. అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వటం జరిగింది. అవి ఏంటో తెలుసుకుందాం.

నిద్ర పట్టాలంటే ఏమి చేయాలి | Nidra Ravadaniki Chitkalu

రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి ఎంచక్కా నిద్రపోండి.

 • రాత్రి పడుకునేముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి
 • రాత్రి పడుకునేముందు  కొన్ని గోరువెచ్చని పాలు తాగాలి
 • గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
 • రాత్రి పడుకునేముందు మీకు నచ్చినా సంగీతాన్ని పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పాడుకోవాలి.
 • పడక గదిలో వెలుతురు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
 • నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి.
  అంతేకాకుండా, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకోవటం వలన  రేడియేషన్‌  కల్గుతుంది.
  దిని వల్ల   కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టి పడుకోండి.
 • పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోని పాడుకోవాలి.
 • పడుకునే ముందు టివిని ఎక్కువగా చూడరాదు.
 • పడుకునే ముందు చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
 • చేతి వేళ్ళతో తల వెంట్రుకలని మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి.
 • నిద్ర పోవటానికి అరగంట ముందు కోద్ది  సేపు  నడవాలి
 • రాత్రిపూట అరటి పండు తినటం వలన శరీరంలో రక్త సరఫరా పెరిగి ఆందోళన ఒత్తిడి దగ్గుతుంది. దీని వల్ల హాయిగా నిద్ర వస్తుంది.
 •  పడుకునే ముందు చెర్రీ పండ్లు  తినటం వలన కూడా నిద్ర బాగా వస్తుంది.
 • పడుకునే ముందు జ్యూస్ తాగటం వలన అందులో ఉండే “మెలటోనిన్” వల్ల నిద్ర చక్కగా పడుతుంది.
 • పడుకునే ముందు బాదం తినటం వలన కండరాలు, మనస్సు రిలాక్స్ అవుతాయి. దీని వల్ల కూడా చక్కగా నిద్ర పడుతుంది.
 • రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం వలన  కూడా చక్కగా నిద్ర పడుతుంది.
  మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించడం జరుగుతుంది
 • పడుకునే ముందు గ్రీన్ టీ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది.
  గ్రీన్ టీ తాగటం వలన ఒత్తిడి,ఆందోళన  తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.దీని వల్ల హయిగా నిద్ర పడుతుంది.

నిద్ర పట్టక పోవటానికి కారణాలు|Nidra Pattaka Povataniki Gala Karanalu In Telugu

చాలా కారణాల వలన నిద్ర సరిగ్గారాదు. వాటిలో కొన్ని కారణాలను క్రింద తెలుసుకొందాం.

 • టివి ని ఎక్కువగా చూడటం
 • పడుకునే ముందు మొబైల్ ఎక్కువగా చూడటం.
 • ఎక్కువగా పని చేయటం
 • పగలు నిద్రపోవటం
 • కంప్యూటర్ స్క్రీన్లను చూడటం.
 • పడుకునే ముందు ఎక్కువగా ఆలోచించడం
 • సరిగ్గా తినకపోటం
గమనిక ;-
పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు నిద్రలేమి సమస్యలు ఉంటె వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-

Leave a Comment