పీసీఓడీ ప్రాబ్లం ఎలా అధిగమించాలి ?

పీసీఓడి అంటే ఏమిటి ?

పీసీఓడీ ప్రాబ్లం ఎలా అధిగమించాలి :-  PCOD (పాలిసైటిక్ అండాశయ వ్యాధి),ప్రపంచంలో దాదాపు 10% మంది మహిళలు పీసీఓడీతో బాధపడుతున్నారు.పిసిఓడి అనేది అండశాయానికి సంబందిన ఒక వ్యాధి.  దీనిలో అండాలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. మరియు ఇవి కాలక్రమేనా అండశాయతిత్తులుగా మారుతాయి. దీనికి కారణం అండాశయాలు పెద్దవిగా మారటం.అంతేకాకుండా  ఆండ్రోజెన్లు (మగ హర్మోలను ) ఎక్కువగా స్రవించడం. ఈ  పీసీఓడి  వల్ల  జుట్టు రాలటం,క్రమరహిత ఋతు చక్రాలు, అసాధారణ బరువు పెరగటం వంటి సమస్యలు వస్తాయి.మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవటం వలన దీనిని నియంత్రించవచ్చు.

పీసీఓడీ అని కూడా పిలువబడే పాలిసిస్టిక్ అండాశయ రుగ్మత 12-45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో సాధారణంగా కనిపించే పరిస్థితి. ఇది అండాశయాల ద్వారా స్రవించే హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే హార్మోన్ల రుగ్మత. దీని లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.

పీసీఓడీ యొక్క లక్షణాలు

చాల మంది అధిక బరువు పెరిగినప్పుడు లేదా గర్భం దాల్చడంలో ఇబ్బంది కల్గినప్పుడు దీనిని కనుగొంటారు. కొంత మంది వారి ఋతుస్రావం సమయంలో కూడా కనుగొంటారు.ఈ క్రింద పీసీఓడీ లక్షలను తెలుసుకుందాం.

 • అధిక ఋతు రక్తస్రావం (మోనోరేజియా)
 • జుట్టు రాలడం
 • క్రమ రహిత ఋతుస్రావం  (ఒలిగోమెనోరియా)
 • బరువు పెరుగుట
 • ఋతుస్రావం లేకపోవటం (అమెనోరియా)
 • చర్మం నల్ల బడటం  (మెడ, గజ్జల్లో మరియు రొమ్ముల క్రింద)
 • జుట్టు ఎక్కువగా పెరగటం (ముఖం,వీపు,ఛాతిలో )
 • మేటిమలు ఎక్కువగా రావటం

పీసీఓడీకి వల్ల కలిగే సమస్యలు 

ఈ పీసీఓడీ వల్ల ఈ క్రింది సమస్యలు వస్తాయి.

 1. రక్తపోటు వంధ్యత్వం
 2. అసాధారణ గర్భాశయ రక్తస్రావం
 3. అధిక రక్త స్రావం
 4. డిప్రెషన్
 5. బరువు పెరటం
 6.  అధిక రక్తపోటు
 7. మధుమేహం
 8. ఎండోమెట్రియల్ క్యాన్సర్ (గర్భాశయ పొర మందంగా మారటం.
 9. సంతలేమి
 10. ముందస్తు ప్రసవం

   పీసీఓడీ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు

పీసీఓడీస అనేది తీవ్రమైన సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం 

 • తగినంత శరీర బరువు ఉండేలా చూసుకోవటం.
 • అధిక పోషకాలు కల్గిన  ఆహారాన్ని తీసుకోవటం
 • వ్యాయామం చేయటం
 • యోగాను క్రమం తప్పకుండా చేయటం
 • ఒత్తిడిని కల్గించే పనులకు దూరంగా ఉండటం

గమనిక :- 

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహనా కోసమే. మీరు పీసీఓడి తో భాద పడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment