గుంట్టురు జిల్లాకు చెందిన రమ్య అనే BTECH విద్యార్థి. ఒక రోజు ఆ అమ్మాయి ని ఒక దుండగుడు నడి రోడు మీదే కత్తి తీసుకొని చంపుతున్న అందరు చూస్తూనే ఉన్నరు తప్ప, ఎవరు కూడా అక్కడకి వచ్చి అడుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి రమ్య దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును మృతురాలి తల్లిదండ్రులు స్వాగతించారు. ఈ సందర్భంగా పోలీసులు, న్యాయవ్యవస్థకు వారు ధన్యవాదాలు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష వేసినందుకు తమకు న్యాయం జరిగిందని భావిస్తున్నానని రమ్య తండ్రి పేర్కొన్నాడు.
సమాజంలో మహిళలపై దాడులకు పాల్పడ్డ మరికొందరికి ఇలాంటి శిక్ష పడితే నేరాలు తగ్గుతాయని అన్నారు. గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థి రమ్యతో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన శశికృష్ణ తనను ప్రేమించాలంటూ రమ్యను వేధించడం ప్రారంభించాడు.
దీంతో రమ్య అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్లీస్ట్లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు 2021లో నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో నిందితుడు కుంచాల శశికృష్ణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 9 నెలల పాటు విచారించి ఇవాళ ఉరి శిక్ష ఖరారు చేసింది.
రమ్య హత్య జరిగినప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. కొత్తగా గుంటూరు స్పెషల్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా శశికృష్ణను ఉరితీయాలని కోరారు.
శిక్ష పడిన హంతకుడు పైకోర్టులను ఆశ్రయించినప్పటికి ఈ శిక్షలో మరో మార్పు వుండే అవకాశాలు లేవని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి నిందితులు శిక్షనుంచి తప్పించునేందుకు ఉన్న లొసుగులను కూడా చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసుపై అప్పట్లో గుంటూరు ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు డీఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు నెలల పాటు రమ్య, శశికృష్ణకు పరిచయం ఉందని తెలిపారు.
అయితే, ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని తనని ప్రేమించాలంటూ నిత్యం బస్టాండ్ వద్ద శశికృష్ణ రమ్యను వేధించేవాడని వివరించారు. హత్యకు రెండు నెలలు ముందు వేధింపులు పెరగడంతో శశికృష్ణతో రమ్య మాట్లాడటం మానేసిందని డీఐజీ తెలిపారు.