ప్రస్తుతం ఉన్న కరోనా వైరేస్ తోనే ప్రజలు ఎక్కువగా మరణిస్తున్నారు. మొదటి దశ నుండి ఇప్పుడు ఉన్న నాలుగో దశ వరకు ఎక్కువ మంది మరణించడం జరిగినది, మన దేశంలోనే కాకుండా ఇతర దేశం వాళ్ళు కూడా ఎక్కువ మంది చనిపోవడం జరిగినది, ఈ వైరేస్ సోకకుండ ఎంత జాగ్రతగా ఉన్న ఎలాగో ఒకలాగా ఈ వైరేస్ రావడం జరుగుతుంది.
కరోనా మొదటి దశ నుండి ఇప్పుడు ఉన్న నాలుగో దశ వరకు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అని తేడా లేకుండా అందరికి ఈ వైరేస్ సోకి ఎక్కువ మంది మరణించడం అయినది, అయితే ఈ వైరేస్ కి మందు వచ్చిన కూడా ఏం లాభం లేకుండా అయినది.
మందు వచ్చిన వేల కూడా ఈ వైరేస్ వలన చాల మంది మరణించడం జరిగినది. అయితే ఈ వైరేస్ పక్కనకి పెడితే ఇప్పుడు ఒక కొత్త వైరేస్ వెలుగులోకి వచ్చింది, ఈ వైరేస్ మొదటిగా కేరళలో రావడం జరిగింది, ఈ కొత్త వైరేస్ గురించి వివరాలు తెలుసుకొందం.
కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైరస్ సోకినట్లు పేర్కొంది.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజింజంలోని ఎల్‌ఎంఎస్‌ఎల్‌పీ స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు.
నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు, పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు తెలియచేస్తున్నారు.
ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు. నోరా వైరస్ చాలా ప్రమాదకారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు.
ప్రస్తుతం వైరస్ బారినపడ్డ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు తొలుత ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు భావించారు.
కానీ, వైద్య పరీక్షల్లో నోరో వైరస్ నిర్దారణ అయ్యింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
నోరోవైరస్ అనేది అంటువ్యాది, ఇది తీసుకున్న ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి జాగ్రతలు పాటించాలని వైద్యులు తెలియచేసారు.
నవంబర్ 2021లో కేరళలో మొదటిసారిగా నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించారు, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు, కొత్త గా మరోసారి కేసులు వెలుగుచూశాయి.
నోరోవైరస్ సోకిన వారికి వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతుంటారు. మూడు రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి, అయితే కోలుకున్న తర్వాత కూడా, సోకిన వ్యక్తి రెండు వారాల వరకు వైరస్‌ను వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.